తెలంగాణ
Formula E Car Race Case: నాకు సంబంధం లేదు.. హైకోర్టులో కేటీఆర్ అఫిడవిట్..

Formula E Car Race Case: తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో తనకు సంబంధం లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఒప్పందాల అమలులో విధానపరమైన అంశాలను చూసే బాధ్యత మంత్రిగా తనది కాదని రిప్లై అఫిడవిట్లో పేర్కొన్నారు. విదేశీ సంస్థకు నిధులు చెల్లింపుపై అనుమతుల వ్యవహారాన్ని సంబంధిత బ్యాంక్ చూసుకోవాలన్నారు.
ఈ కార్ రేస్‌కు ప్రమోటర్‌గా బాధ్యతలు తీసుకునే ముందు చెల్లింపుల విషయంలో చట్టప్రకారం అన్ని అంశాలను చట్టబద్దమైన సంస్థ హెచ్ఎండీఏ చూసుకోవాలని కేటీఆర్ అన్నారు. 10 కోట్లు మించిన చెల్లింపులకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని హెచ్ఎండీఏ నిబంధనల్లో ఎక్కడా లేదని కేటీఆర్ అన్నారు.