జాతియం

Pune Rape Case: పుణె అత్యాచార ఘటన.. జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు

Pune Rape Case: మహారాష్ట్రలోని పుణెలో 26 ఏళ్ల యువతిపై బస్సులో ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. రాజకీయంగా దుమారం రేపుతోంది. దీనిపై మాజీ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

నిర్భయ ఘటన తర్వాత చట్టాల్లో ఎన్నో మార్పులు వచ్చాయని కేవలం చట్టాలతోనే అలాంటి ఘటనలను నివారించలేమన్నారు. మహిళల కోసం తీసుకొచ్చిన చట్టాలను సక్రమంగా అమలు చేయాలని సూచించారు చంద్రచూడ్‌. ఎక్కడికి వెళ్లినా తాము సురక్షితంగా ఉన్నామనే నమ్మకాన్ని కలిగించాలని చెప్పారు. ఇలాంటి కేసుల్లో సరైన దర్యాప్తు, కఠిన చర్యలు అత్యంత కీలకమన్నారు చంద్రచూడ్‌.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button