కొండా సురేఖ ఫొటో లేకుండా ఫ్లెక్సీలు

వేములవాడ పట్టణ కాంగ్రెస్ నాయకులు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఫొటోలు ఫెక్సీల్లో ముద్రించకపోవడం గ్రూప్ వార్‌కు తెరలేపుతోంది. ఈ మధ్య సీఎం రేవంత్‌రెడ్డిపై, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్ తీవ్ర ఆరోపణలు చేశారు. కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డీని ప్రభుత్వం తొలగించాక మంత్రి కొండా సురేఖ రేవంత్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షితో మీటింగ్ వల్లే కొండా..క్యాబినెట‌్ మీటింగ్‌కు హాజరుకాలేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వివాదం సమసిపోయిందని ప్రకటనలు ఇస్తున్నప్పటికీ తాజాగా వేములవాడలో ఫ్లెక్సీలు మళ్లీ గ్రూప్‌వార్ తెరపైకి తీసుకొస్తున్నాయి. జగద్గురు శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి మహాస్వామి విజయ యాత్రలో భాగంగా ఆయనకు స్వాగత ఫ్లెక్సీలు వెలిశాయి. ఇందులో దేవాదాయశాఖ మంత్రి ఫొటో లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ఫొటోలు మాత్రమే ఉన్నాయి. స్వాగత పోస్టర్లలో స్థానిక శాసనసభ్యుడు విప్ ఆది శ్రీనివాస్ ఫొటోలు మాత్రమే ఉన్నాయి. దేవాదాయశాఖ మంత్రి అయిన కొండా సురేఖ ఫొటో లేకపోవడం ఇతర మంత్రులు, విప్ ఫొటోలు మాత్రమే ఉండటం పార్టీలో గుసగుసలకు కారణం అవుతోంది.



