సినిమా
నాని ది ప్యారడైజ్‌తో రచ్చ!

నాచురల్ స్టార్ నాని కొత్త చిత్రం ‘ది ప్యారడైజ్’తో సంచలనం సృష్టించనున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. నాని లుక్, నేపథ్యం అంచనాలను పెంచుతున్నాయి.
‘ది ప్యారడైజ్’లో నాని ‘జడల్’ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తాజా పోస్టర్లో తెలుస్తుంది. జడలు, ముక్కుకు రింగ్‌తో నాని సరికొత్త అవతారం అభిమానులను ఆశ్చర్యపరిచింది. పోస్టర్‌లో హింసాత్మక నేపథ్యం, తుపాకులు, గొడ్డళ్లు యాక్షన్ డ్రామాను సూచిస్తున్నాయి.
శ్రీకాంత్ ఓదెల కథ, నాని నటనతో ఈ చిత్రం థ్రిల్లింగ్ అనుభవాన్ని అందించనుంది. అనిరుద్ సంగీతం, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ నిర్మాణంతో ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందుతోంది. అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు చేసిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. రిలీజ్ డేట్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.



