తెలంగాణ
Khammam: రూ.500 కోసం గొడవ.. తన్నుకున్న రెండువర్గాలు

Khammam: ఖమ్మం నగరంలో దారుణం చోటు చేసుకుంది. 500 రూపాయల కోసం రెండు వర్గాలుగా ఏర్పడి తన్నుకున్నారు. అపార్ట్మెంట్లో 500ల కోసం మొదలైన గొడవ.. చినికి చినికి గాలి వానలా మారింది. రోడ్డుపై యువకులు పిడిగుద్దులు గుద్దుకున్నారు.
ఇరువర్గాల బాహాబాహీతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తం కావడంతో పలువురు స్థానికుల జోక్యం చేసుకుని వివాదం సద్దుమనిగేలా చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు.