తెలంగాణ
Hyderabad: ఆర్ధిక ఇబ్బందులతో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

Hyderabad: రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో మహిళా కానిస్టేబుల్ దీపిక ఆత్మహత్య చేసుకుంది. దీపిక నాగోల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంది. మహిళా కానిస్టేబుల్ దీపిక హస్తినాపురం టీచర్స్ కాలనీలో నివాసం ఉంటుంది. భర్త రవికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.