తెలంగాణ
Mahabubabad: యూరియా కోసం అన్నదాతల పడిగాపులు

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కోసం అన్నదాతలు పడిగాపులు గాస్తున్నారు. కొత్తగూడెం మండలం పోగుళ్లపల్లిలో యూరియా బస్తాల కోసం బారులు తీరారు. ఉదయం నుండి రాత్రి వరకు నిలబడలేక క్యూలైన్లలో ఆధార్ కార్డులు, బస్తాలు పెట్టి నిరీక్షిస్తున్నారు. యూరియా ఎప్పుడు వస్తుందో తెలియక ఆందోళన చెందు తున్నారు. అధికారులు స్పందించి యూరియా ఇప్పించాలని కోరుతున్నారు.