తెలంగాణ
Jayashankar Bhupalpally: భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న భర్త

Jayashankar Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య సంధ్యను తాడుతో ఉరివేసి చంపి ఆపై తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు భర్త బాలరాజు రామాచారి. భార్య, కూతురు కలిసి బాలరాజును వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే వారి వేధింపులు భరించలేక ఇంట్లో ఎవరు లేని సమయంలో భార్య సంధ్యను హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు బాలరాజు. మొదటి భార్య చనిపోగా సంధ్యను రెండో వివాహం చేసుకున్నాడు బాలరాజు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



