ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగుల బీభత్సం

తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంప్‌హౌస్ వద్ద రాత్రి ఏనుగుల గుంపును డ్రోన్ కెమెరాతో అధికారులు గుర్తించారు. పంట పొలాలను గజరాజులు ధ్వంసం చేశాయి. వినాయకస్వామి చెక్ పాయింట్ వద్ద అధికారులు భక్తులను గంట పాటు నిలిపివేశారు. అటవీ, టీటీడీ ఫారెస్ట్, విజిలెన్స్ అధికారుల సమన్వయంతోఏనుగులను తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బంది భక్తులను గుంపులు గుంపులుగా తరలిస్తున్నారు.