తెలంగాణ
మావోయిస్టుల ఆర్థక వనరులపై ఈడీ ఫోకస్

మావోయిస్టు కార్యకలాపాలకు ఆర్థిక వనరులు సమకూర్చే నెట్‌వర్క్‌పై ఈడీ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ అధినేత దినేష్ గోపేపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. జార్ఖండ్ పోలీసులు, ఎన్ఐఏ ఎఫైఆర్ ఆధారంగా ఈ కేసు నమోదు చేసింది ఈడీ.
ఈ కేసులో దినేష్ గోపేతో పాటు 19 మంది అనుచరులను అదుపులోకి తీసుకున్న ఈడీ ప్రస్తుతం వారిని విచారిస్తోంది. వీరంతా మావోయిస్టుల కోసం డబ్బు సేకరణ, అక్రమ లావాదేవీలు, ఆయుధాల కొనుగోలు, మరియు భూకబ్జాలు వంటి కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారని ఈడీ గుర్తించింది.



