తెలంగాణ
Nirmal: ఆరో తరగతి విద్యార్థిపై సీనియర్ విద్యార్థుల లైంగిక దాడి

Nirmal: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో మస్కాపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఆరో తరగతి విద్యార్థిపై ఇద్దరు సీనియర్ విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మస్కాపూర్ బీసీ హాస్టల్ ఉంటూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యానభ్యసిస్తున్నారు విద్యార్థులు. అయితే వారం క్రితం అర్థరాత్రి సమయంలో 6వ తరగతి విద్యార్థిపై 9వ తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు.
ఈ విషయాన్ని బాలుడు కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఈ విషయం బయటపడింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేంద్రరావు విచారణ చేపట్టారు. విద్యార్థుల వికృత చేష్టలపై ఆరా తీసిన ప్రధానోపాధ్యాయులు నరేంద్రరావు జరిగిన విషయాన్ని వారి తల్లిదండ్రులకు వివరించి విద్యార్థులకు టీసీ ఇచ్చి పంపించేశారు.



