తెలంగాణ

కంటోన్మెంట్ లో ఎంపీ ఈటల పర్యటన

Eatala Rajendar: రాష్ట్రపతి తరువాత అత్యున్నత స్థానమైన ఉప రాష్ట్రపతి పదవిని రాధాకృష్ణ చేపట్టడం దక్షిణ భారతదేశానికే గర్వకారణమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణ అకుంఠిత దీక్షతో ,కమిట్ మెంట్ తో పని చేస్తారని తెలిపారు. ప్రజాస్వామ్య పరిపుష్టికి నాంది పలుకుతారని వెల్లడించారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ 6వ వార్డు కార్తిక్ ఎన్ క్లేవును సందర్శించిన ఆయన పార్కును ప్రారంభించారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, ఇప్పటికే డ్రైనేజి పైప్ లైన్ పనుల కోసం 22లక్షల నిధులు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button