ఆంధ్ర ప్రదేశ్

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజున అమ్మవారి దర్శిస్తే.. దుర్గతుల నుంచి తప్పించుకోవచ్చనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గారూపం మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుందనీ నమ్మకం. కోటి సూర్యప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలుగుతాయనీ, సర్వత్రా విజయం ప్రాప్తిస్తుందనీ భక్తులు నమ్ముతారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button