ఏసీబీకి చిక్కిన సూర్యాపేట డీఎస్పీ, సీఐ

ఏసీబీకి అవినీతి తిమింగలాలు చిక్కాయి. చట్టాన్ని రక్షించాల్సిన ఖాకీలే..అవినీతి తెగబడుతున్నారు. సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. డీఎస్పీ పార్ధసారథి, సీఐ వీర రాఘవులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. సూర్యాపేటలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓ స్కానింగ్ సెంటర్‌పై టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
కేసు లేకుండా చేయడానికి స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడిని సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, పట్టణ ఇన్‌స్పెక్టర్ వీరరాఘవులు 25 లక్షలు డిమాండ్ చేయగా 16 లక్షలకు ఒప్పందం కుదిరింది. స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా నల్లగొండ రేంజ్ ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలోని బృందం ఫోన్ కాల్ రికార్డింగ్ ఆధారంగా డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరిని నాంపల్లి కోర్టులో రిమాండ్ చేయనున్నట్టు అధికారులు తెలిపారు.