ఆంధ్ర ప్రదేశ్

Tirupati: 220 కేవీ టవర్ ఎక్కిన వ్యక్తి.. చివరకు మృతి

Tirupati: కొందరు వ్యక్తులు చిత్ర విచిత్రమైన పనులు చేస్తుంటారు. మద్యం సేవించి పలువురు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇలాంటి ఘటనే తిరుపతిలో చోటు చేసుకుంది. ఈ వ్యక్తి ఏకంగా విద్యుత్ టవర్ ఎక్కి మరీ హంగామా చేశాడు.

తిరుపతి రేణిగుంట మండలం గురవరాజు పల్లిలో ఓ వ్యక్తి పొలాలలోని 220 కేవీ విద్యుత్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. అర్ధరాత్రి రెండు గంటల నుంచి టవర్ పైనే ఉంటూ హంగామా చేశాడు. వెంటనే గుర్తించిన గ్రామస్తులు అతడిని కిందకు దిగాల్సిందిగా కోరారు. వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వెంటనే అర్బన్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వ్యక్తిని కిందకు దించే ప్రయత్నం చేశారు.

220 కెవి హై వోల్టేజ్ టవర్ ఎక్కిన శివాని మృతి చెందినట్లు బాలాజీ హాస్పిటల్ డాక్టర్లు నిర్ధారించారు. శివాని కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. అయితే ఎక్కువ సేపు టవర్ పైనే ఉండడంతో శివాని శక్తి క్షీణించడంతో అక్కడ నుండి కిందికి పడిపోయాడు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానికులు వల సహాయంతో అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు. శివాని వలలో పడినప్పటికీ నోటి నుండి రక్తం రావడంతో హుటా హుటిన బాలాజీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శివాని మృతి చెందాడు.

అసలు అతను ఎందుకు టవర్ ఎక్కాడో కూడా తెలియటం లేదు. టవర్ ఎక్కే ప్రయత్నం చేస్తే ఎక్కడ దూకేస్తాడో అని పోలీసులు ఆలోచిస్తున్నారు. మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే 220 కేవీ విద్యుత్ సరఫరాను విద్యుత్ అధికారులు నిలిపివేశారు. టవర్ ఎక్కిన వ్యక్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆ వ్యక్తి కిందకు దిగుతాడా లేదా అనే ఉత్కంఠతో గ్రామస్తులు రాత్రి నుంచి కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు. ఎలాగైనా అతడిని కిందకు దింపాలని పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button