అంతర్జాతీయం

Donald Trump: ట్రంప్ మరో షాక్.. ఇండియాకు డబ్బులు పంపితే పన్ను

Donald Trump: అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు ట్రంప్‌ సర్కార్ షాకిచ్చింది. అమెరికా నుంచి ఇతర దేశాలకు జరిగే నగదు బదిలీలపై 5శాతం పన్ను వసూలు చేసేందుకు వీలుగా ‘బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌’ పేరిట బిల్లును తీసుకొచ్చింది. అయితే ప్రతినిధుల సభ బడ్జెట్‌ కమిటీ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు వ్యతిరేకించింది. అయిదుగురు రిపబ్లికన్లు కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు. దీంతో సవరణలు చేసి బిల్లును తిరిగి ప్రతినిధుల సభలో ప్రవేశపెడతామని స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ తెలిపారు.

ఒకవేళ బిల్లు ఆమోదం పొందితే అమెరికాలో సంపాదించిన డబ్బును వేరే దేశాల్లో ఉన్న తమ వారికి పంపే విదేశీయులు పన్నుల రూపంలో భారీగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిపాదిత విధానం ప్రకారం అమెరికాలో ఉన్న భారతీయులు, స్వదేశంలో ఉన్న తమ వారికి 1,160 డాలర్లు అనగా దాదాపు లక్ష రూపాయలు పంపిస్తే అందులో ఐదు శాతం అంటే 5వేల రూపాయలను పన్నుగా చెల్లించాలి.

ఈ పన్నును నగదు బదిలీ సేవలను అందించే వెస్ట్రన్‌ యూనియన్‌, మనీగ్రామ్‌ లేదా అమెరికా ప్రభుత్వ గుర్తింపు పొందిన బ్యాంకులు వసూలు చేస్తాయి. హెచ్‌-1బీ, ఎఫ్‌-1 లేదా జే-1 తదితర వీసాదారులు, గ్రీన్‌ కార్డుదారులు, తగిన గుర్తింపు పత్రాలు లేనివారు నగదు బదిలీలు చేసినప్పుడు ఈ పన్ను చెల్లించాల్సిందే.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button