సినిమా
Trinadha Rao: హీరోయిన్ అన్షుపై చేసిన వ్యాఖ్యలపై.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు త్రినాథ్‌రావు

Trinadha Rao: హీరోయిన్ అన్షుపై చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు త్రినాథ్ రావు క్షమాపణలు చెప్పారు. మహిళలకు, అన్షుకు తన మాటలు వల్ల బాధపడ్డ ఆడవాళ్ళందరికీ క్షమాపణలు తెలియజేసుకుంటున్నానని క్లారిటీ ఇచ్చారు. నా ఉద్దేశ్యం ఎవరిని బాధ కలిగించడం కాదన్నారు దర్శకుడు త్రినాథ్ రావు. తెలిసి చేసినా తెలియకుండా చేసిన తప్పు తప్పే అని అన్నారు.
పెద్ద మనసు చేసుకొని క్షమిస్తారని కోరుకుంటున్నానని దర్శకుడు త్రినాథ్ రావు వీడియో విడుదల చేశారు . మజాక టికెట్ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు త్రినాథ్ రావు హీరోయిన్ అన్షు పై మాట్లాడిన మాటలు విమర్శలకు దారి తీసింది. ఇప్పటికే దర్శకుడు త్రినాథ్ రావు వ్యాఖ్యాలపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది.