టాలీవుడ్

Dil Raju: ముగిసిన నిర్మాత దిల్‌రాజు విచారణ

Dil Raju: నిర్మాత దిల్‌రాజు విచారణ ముగిసింది. రెండు గంటలపాటు ఐటీ అధికారులు దిల్‌రాజును విచారించారు. ముఖ్యంగా సినీ నిర్మాణం, సినిమాల విడుదల తర్వాత లాభాల వ్యవహారంపై ఆరా తీసినట్లు సమాచారం. పలు డాక్యుమెంట్లతో విచారణకు హాజరైన దిల్ ‌రాజుకు.. అందుబాటులో ఉండాలని ఐటీ బృందం చెప్పినట్లు తెలుస్తుంది.

ఇటీవల దిల్‌రాజు నివాసంలో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఏకంగా నాలుగు రోజులపాటు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. కాగా.. ఇటీవల నిర్మాత దిల్‌రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్, ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాలు విడుదలయ్యాయి. ఈ క్రమంలోనే దిల్‌రాజు నివాసంలో ఐటీ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. అటు ఐటీ సోదాలు ముగిశాక ప్రెస్‌మీట్ పెట్టిన దిల్‌రాజు.. ఐటీ సోదాలు జరగడం మామూలేనన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button