తెలంగాణ
వర్ష బీభత్సం.. వాగులో కొట్టుకుపోయిన కారు

యాదాద్రి జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వర్షాల ధాటికి నేలపట్ల ఈదుల వాగు పొంగిపోర్లుతుంది. నేలపట్ల ఈదుల వాగులో ఓ కారు నీట మునిగింది. వర్షాలతో నీటి ప్రవాహం పెరగడాన్ని అంచనా వేయకుండా డ్రైవర్ వాగు దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
కొంత దూరం కొట్టుకుపోయిన కారు పక్కకు ఆగిపోయింది. అందులోని ఏడుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వారు వర్కట్‌పల్లిలో పెళ్లికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.



