Shehbaz Sharif: భారత్ దాడులను అంగీకరించిన పాక్ ప్రధాని

Shehbaz sharif: పహల్‌గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’తో దాయాది పాకిస్థాన్ వణికిపోయింది. భారత్ మిలిటరీ దాడులు ఆ దేశ వైమానిక దళాన్ని చావుదెబ్బ కొట్టాయి. శత్రువుల కీలక వైమానిక స్థావరాలను మన క్షిపణులు ధ్వంసం చేశాయి. అయితే, ఈ నష్టంపై ఇన్నాళ్లూ బుకాయిస్తూ వస్తోన్న పాక్.. తాజాగా దాన్ని అంగీకరించింది. భారత క్షిపణుల దెబ్బ తమకు తగిలిందని స్వయంగా ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ధ్రువీకరించారు.
ఈ నెల 9 అండ్ 10వ తేదీన భారత్ దాడులు ప్రారంభించిన కొన్ని క్షణాల తర్వాత, తెల్లవారుజామున 2గంటల 30నిమిషాల ప్రాంతంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ తనకు ఫోన్ చేసి చెప్పారన్నారు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్. రావిల్పిండిలోని నూర్‌ఖాన్ సహా ఇతర స్థావరాలపై దాడి జరిగిందని చెప్పినట్లు వెల్లడించారు. ఆ సమయంలో తమ వైమానిక దళం స్థానిక సాంకేతిక పరిజ్ఞానం, చైనీస్ యుద్ధ విమానాలను వినియోగించిందని అని పాక్ ప్రధాని వెల్లడించారు.