ఆంధ్ర ప్రదేశ్
తిరుమల ఫోటోపై చెప్పులతో హీరో కటౌట్.. భక్తుల ఆగ్రహం

తిరుపతిలో శ్రీవారికి అపచారం జరిగింది. తిరుమల ఆలయ ఫోటో కింద రామ్ రాజ్ సంస్థ ప్రచార హోర్డింగ్ పెట్టారు. అయితే స్వామివారి పెయింటింగ్ పైన రామ్ రాజ్ సంస్థ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. తిరుమల కొండ ఫోటోపై హీరో వెంకటేష్ చెప్పు వేసుకున్న ఫోటో ఉండటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల ఫోటో పైనా ఇలాంటి హోర్డింగ్‌కు ఎలా అనుమతి ఇచ్చారని భక్తులు మండిపడుతున్నారు.



