ఆంధ్ర ప్రదేశ్
Devineni Avinash: బాబు సర్కార్‌పై తిరుగుబాటు తప్పదు

Devineni Avinash: ఏపీలో రెడ్‌బుక్ పాలన నడుస్తోందని వైసీపీ నేత దేవినేని అవినాష్ అన్నారు. వైసీపీ నేతలపై అన్యాయంగా కేసులు బనాయిస్తున్న కూటమి సర్కార్‌పై తిరుగుబాటు తప్పదని అవినాష్ హెచ్చరించారు.
వైసీపీ పార్టీ కార్యకర్త చనిపోతే కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న హింస భరించలేక ప్రజలు మళ్లీ జగన్ రావాలని కోరుకుంటున్నారని అవినాష్ అన్నారు.