సినిమా

AA22లో షాకిస్తున్న దీపిక, మృణాల్‌ రోల్స్?

అల్లు అర్జున్‌ – అట్లీ సినిమా అప్‌డేట్స్‌పై బన్నీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా లేడీ డాన్‌గా, మృణాల్ ఠాకూర్ పోలీసు అధికారిగా నటిస్తున్నట్టు సమాచారం. జాన్వీ కపూర్ కూడా మరో కథానాయికగా కనిపించనుంది. మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథపై ఆసక్తి నెలకొన్నది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, అట్లీ చిత్రం ఇప్పటికే అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో భారీ అంచనాల మధ్య ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఇందులో దీపికా స్టైలిష్ లేడీ డాన్‌గా కనిపించబోతున్నారు. మరో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పవర్‌ఫుల్ పోలీసు అధికారిగా నటిస్తున్నారు. జాన్వీ కపూర్ మూడో కథానాయికగా నటిస్తున్నారు.

మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో అల్లు అర్జున్ ఎలాంటి పాత్ర పోషిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తదుపరి షెడ్యూల్‌లో అల్లు అర్జున్ – జాన్వీ కపూర్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారని టాక్. ఆ తర్వాత దీపికా షూటింగ్‌లో చేరనున్నారట. అట్లీ రాసిన పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌కు తగ్గట్టు కొన్ని స్పెషల్ గెస్ట్ రోల్స్ కూడా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button