ఆంధ్ర ప్రదేశ్
CPI Ramakrishna: హామీల అమలులో కూటమి ప్రభుత్వం ఫ్లాప్

CPI Ramakrishna: కూటమి ప్రభుత్వంపై సీపీఐ నేత రామకృష్ణ ఫైరయ్యారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఫ్లాప్ అయిందని ఆయన విమర్శించారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ ఎత్తును తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండా బనకచర్ల అంటూ కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారని ఆయన ధ్వజమెత్తారని అన్నారు. గండికోట ప్రాజెక్టులో తగినంతగా నీరున్నా దాన్ని వాడుకునే పరిస్థితులు లేవని సీపీఐ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.