ఆంధ్ర ప్రదేశ్
CPI Ramakrishna: సీఎం చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరింది

CPI Ramakrishna: ముఖ్యమంత్రి చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. పుట్టపర్తి సత్య సాయిబాబా జన్మదిన వేడుకలకు 6 మంది మంత్రులను కేటాయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రులకు ఏం పని లేదా ఖాళీగా కూర్చుని గోళ్లు కోరుకుంటున్నారా అపి విరుచుకుపడ్డారు. సత్య సాయి బాబా జన్మదిన వేడుకల్లో మంత్రులు అన్నం వడ్డిస్తారా ? ఇస్తరాకు ఎత్తేస్తారా అని ప్రశ్నించారు. కూటమి నాయకులకు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని కేవలం పబ్లిసిటీ పైనే ఉందని విమర్శించారు.



