ఆంధ్ర ప్రదేశ్
CPI Ramakrishna: పోలవరం ఎత్తు తగ్గిస్తే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి

CPI Ramakrishna: కూటమి ప్రభుత్వంపై సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. పోలవరం ఎత్తు తగ్గిస్తే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఒప్పకున్నారని అన్నారు.
ఇరిగేషన్ కాల్వలపై ప్రైవేట్ సంస్థల పెత్తనం పెరిగిపోతుందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు చేసే అభివృద్ధి సంపన్నలకు ఉపయోగపడుతుందన్నారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో బీజేపీ జెండా మోసుకొని తిరుగుతున్నారని ఆయన విమర్శించారు.