ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీపీ రాధాకృష్ణన్

Tirumala: ప్రపంచ దేశాలలో మన భారతదేశం శక్తివంతమైన దేశంగా ఎదగాలని తిరుమల శ్రీవారిని ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ప్రార్థించారు. నైవేద్య విరామ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు అదనపు ఈఓ వెంకయ్య చౌదరి మహాద్వారం వద్ద స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసారు.
గర్భాలయంలో మూలవిరాట్టును దర్శించుకొని గవర్నర్ రాధాకృష్ణన్‌ను మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసారు. అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాధాకృష్ణన్ ను శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేసారు.స్వామి అనుగ్రహంతో దేశప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు అన్నారు.



