ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో దంపతుల ఆత్మహత్య

Tirumala: ఆపద మొక్కులవాడు కొలువుదీరిన తిరుమలలో విషాదం నెలకొని ఉంది. నందకం అతిథిగృహంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. తిరుపతిలోని అబ్బన్నకాలనీకి చెందిన శ్రీనివాసులు, అరుణ అనే ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. దంపతుల ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.