తెలంగాణ
హైకోర్టు తీర్పు, స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ జూమ్ మీటింగ్

హైకోర్టు తీర్పు, స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ జూమ్ మీటింగ్ కొనసాగుతోంది. జూమ్ మీటింగ్‌లో సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లపై చర్చిస్తున్నారు. జూమ్ మీటింగ్‌లో మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల ప్రక్రియ మొదలైందని పార్టీ పరంగా చాలా సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు.



