సినిమా

Balakrishna-Boyapati: బాలయ్య, బోయపాటి మధ్య విభేదాలు?

Balakrishna-Boyapati: నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం ‘అఖండ 2’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌పై రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత? పూర్తి వివరాల్లోకి వెళదాం..

బాలయ్య-బోయపాటి కాంబినేషన్ అంటే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయం. గతంలో వచ్చిన ‘అఖండ’ రికార్డులను బద్దలు కొట్టి అభిమానులను ఉర్రూతలూగించింది. ఇప్పుడు ‘అఖండ 2’ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, షూటింగ్‌లో బాలయ్య-బోయపాటి మధ్య విభేదాలున్నాయంటూ కొన్ని రూమర్స్ జోరుగా స్ప్రెడ్ అయ్యాయి.

షూటింగ్ సజావుగా సాగడం లేదన్న ప్రచారం కూడా జరిగింది. కానీ, ఈ గాసిప్స్‌లో ఎలాంటి నిజం లేదని తాజా సమాచారం చెబుతోంది. షూటింగ్ అనుకున్న షెడ్యూల్ ప్రకారమే శరవేగంగా జరుగుతోంది. థమన్ సంగీతం అదిరిపోనుందని టాక్. కాగా, 14 రీల్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాలయ్య మాస్ యాక్షన్‌తో మరోసారి అఖండ మ్యాజిక్ రిపీట్ కాబోతోందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button