Sudheer Reddy: కేటీఆర్ ఆదేశాలతో నిరసనలు చేపడతాం

Sudheer Reddy: హైదరాబాద్ ఎల్బీనగర్‌లో పొలిటికల్ హీట్ రాజుకుంది. కాంగ్రెస్-బీఆర్ఎస్ అండ్ బీజేపీ మధ్య రచ్చ జరిగింది. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రొటోకాల్ వివాదం రాజుకుంది. ఈ నెల 12న మన్సూరాబాద్ డివిజన్‌లో అభివృద్ధి పనులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే సుధీర్ రెడ్డి ప్రోటోకాల్ ఉల్లంఘించారంటోంది బీజేపీ. దీంతో సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేసిన పనులకే బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి మళ్లీ శ్రీకారం చుట్టడం వివాదాస్పదంగా మారింది.
మరోవైపు శంకుస్థాపన పూర్తయిన పనులకు.. మళ్లీ ఎలా శ్రీకారం చుడతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి క్వశ్చన్స్ చేశారు. దీంతో ఇరుపార్టీ నేతల అనుచరులు నిరసనకు దిగారు. ఆందోళనల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసే క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులకు గాయాలయ్యాయి. ఇక పోలీసుల తీరుపై ఎల్బీనగర్‌లోని డీసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
ఇక తమ కార్యకర్తలపై కావాలనే దాడులు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కొంతమంది బీజేపీ కార్పొరేటర్లతో కాంగ్రెస్ నేత మధుయాష్కి గౌడ్ హనీమూన్ నడుస్తోందంటూ విమర్శించారు. కాంగ్రెస్-బీజేపీ చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటున్నారని మండిపడ్డారు. అయితే ఇలాగే దాడులు కొనసాగితే ఆందోళనకు దిగుతామన్న సుధీర్ రెడ్డి తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో నిరసనలు చేపడతామన్నారు.