తెలంగాణ
CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీ బిజీ..

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూడో రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ మరికొందరు కేంద్ర మంత్రులను రేవంత్ కలిసే అవకాశం ఉంది. నిన్న కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాతో రేవంత్ భేటీ అయ్యారు. తెలంగాణలో యూరియా కొరత, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
యూరియా సరఫరా పెంచాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి సరిపడే యూరియాను కేటాయించాలని ఇటీవలే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు జేపీ నడ్డాకు లేఖ రాశారు. అరకొర సరఫరా కారణంగా రాష్ట్రంలో దాదాపు 1.94 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఏర్పడిందని.. అందువల్ల యూరియా లోటును భర్తీ చేయడానికి అదనపు కోటాను కేటాయించాలని కోరారు.