ఆంధ్ర ప్రదేశ్

విజయనగరం జిల్లాలో రేపు పెన్షన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్టోబరు 1న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్న సందర్భంగా పర్యటన ఏర్పాట్లను మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాసరావు, గుమ్మడి సంధ్యారాణి పరిశీలించారు. హెలిప్యాడ్, ప్రజా వేదిక, పెన్షన్లు పంపిణీ చేసే ఇండ్లను, కార్యకర్తలతో సమావేశం కానున్న ప్రాంగణాన్ని మంత్రులు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే బేబీ నాయన, కిమిడి నాగార్జున అధికారులు పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనలో పోలీసు సిబ్బంది, అధికారులు వ్యవహరించాల్సిన తీరు, చేపట్టాల్సిన భద్రత చర్యలపై అధికారులకు, సిబ్బందికి ప్రజాప్రతినిధులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, దిశా నిర్దేశం చేసారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button