ఆంధ్ర ప్రదేశ్
ఢిల్లీకి సీఎం చంద్రబాబు

కాసేపట్లో సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయల్దేరనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా రెండ్రోజులపాటు కేంద్రమంత్రులను కలవనున్నారు. మధ్యాహ్నం 12గంటల 30నిమిషాలకు అమిత్ షాతో భేటీ కానున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 3గంటలకి ఢిల్లీ మెట్రో ఎండీతో సమావేశమవుతారు.
ఇక రాత్రి 7గంటలకి అశ్వినీ వైష్ణవ్‌ను చంద్రబాబు కలుస్తారు. రేపు మధ్యాహ్నం 2గంటల 30నిమిషాలకు సీఆర్ పాటిల్‌తో సాయంత్రం 4గంటల 30నిమిషాలకు నిర్మలమ్మతో పలు అంశాలపై చర్చిస్తారు. రాత్రి ఢిల్లీలోనే బస చేయనున్నారు. మొత్తానికి ఇవాళ, రేపు సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు.