ఇవాళ ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన

నేడు ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీలో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పలుమార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి కీలక అంశాల్లో ఆర్ధిక సాయంతో పాటు ప్రాజెక్టుల్నీ సాధించుకున్న చంద్రబాబు ఇప్పుడు మరోసారి హస్తిన వెళ్లబోతున్నారు. నేడు ఎకనామిక్ టైమ్స్ నిర్వహించే సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లబోతున్న చంద్రబాబు మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ తో భేటీ కానున్నారు.
రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ది కార్యక్రమాలకు కేంద్ర మంత్రికి వివరించి ఆర్థిక సాయం కోరనున్నారు. సాస్కి తో పాటు పూర్వోదయ పథకం తరహాలో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి నిధులు కేటాయించాలని చంద్రబాబు ఆమెను విజ్ఞప్తి చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ఓ ప్రైవేటు హోటల్ లో ఎకనమిక్ టైమ్స్ నిర్వహించే వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు.



