ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: కనిగిరి కనకపట్నంగా మారే రోజు దగ్గరలోనే ఉంది

Chandrababu: ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా దానికి మూల హేతువు బ్రహ్మంగారి కాలజ్ఞానం ఆ కాలజ్ఞానం ప్రకారమే ప్రపంచ పటం ముందుకు కదులుతుందనేది అందరి నమ్మకం కడపజిల్లా కందిమల్లాయపల్లి గ్రామంలో సజీవ సమాధిలో యోగ నిష్ఠలో బ్రహ్మంగారు ఇప్పటికీ ఉంటున్నారని భక్తుల నమ్మకం అలాంటి కాలజ్ఞాని మాటను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఉటంకించారు.
ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. బ్రహ్మంగారు చెప్పినట్టుగా కనిగిరి కనకపట్నం అవుతుందననడానికి రోజులు మరెంతో దూరంలో లేవంటూ చెప్పుకొచ్చారు. దీంతో కాలజ్ఞానం గొప్పదనం మరోసారి రుజువు కాబోతుందని భక్తులు నమ్ముతున్నారు.



