ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: రైతే రాజుగా మారాలి

Chandrababu: ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభమైంది. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పువీరాయపాలెంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రైతులకు చెక్కులను అందించారు. అన్నదాత సుఖీభవ పథకంతో 46 లక్షల 85 వేల 838 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
రైతుల ఖాతాల్లో 2 వేల 342 కోట్లు జమ చేయనుంది ప్రభుత్వం. రైతు రాజుగా మారాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. వైసీపీ హయాంలో అరాచక సైకో పాలన నడిచిందన్నారు.