ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: కృష్ణా జలాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu: కృష్ణా జలాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల విషయంలో ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులకునే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. జలాల కేటాయింపులపై పునఃసమీక్షకు అంగీకరించేది లేదన్నారు.
కేంద్రం ముందు బలమైన వాదనలు వినిపించాలని అధికారులకు ఆదేశించారు. వరద జలాలను మాత్రం సామరస్యంగా పంచుకోవడానికి సిద్ధమన్నారు. ది తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.



