ఆంధ్ర ప్రదేశ్

Chandrababu: బిల్‌గేట్స్‌తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ

Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రాభివృద్ధి దిశగా ఇరువురు అనేక అంశాలపై లోతైన చర్చ జరిపారు. ఈ సందర్భంగా ఒప్పందంపై సంతకాలు జరిగాయి.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం కుదురింది. ఏపీ గవర్నమెంట్, గేట్స్ ఫౌండేషన్ మధ్య వ్యూహాత్మక సహకారానికి రూపకల్పన చేస్తుంది.

దీనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన భాగస్వాములకు, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలలో వివిధ ప్రయోజనాల కోసం గేట్స్ ఫౌండేషన్ మద్దతు ఇస్తుంది. ఈ భాగస్వామ్యం ద్వారా ఆరోగ్య విశ్లేషణ, ఆటోమేటెడ్ డయాగ్నస్టిక్స్ కోసం ఏఐని ఉపయోగించడం జరుగుతుంది.

వ్యవసాయంలో, ఏఐ ఆధారిత సలహా వేదికలు, ఖచ్చితమైన వ్యవసాయం, వనరుల నిర్వహణ కోసం ఉపగ్రహ ఆధారిత వ్యవస్థలను ప్రవేశపెట్టనున్నారు. అవగాహన ఒప్పందం ద్వారా వచ్చే ఫలితాలు మన రాష్ట్రానికి మాత్రమే కాకుండా, ఇతర ప్రాంతాలకు కూడా ఆదర్శంగా నిలుస్తాయని చంద్రబాబు అన్నారు. డేటా ఆధారిత ఆవిష్కరణ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడానికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని బిల్ గేట్స్ ప్రశంసించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button