Chandrababu: విశాఖలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

Chandrababu: విశాఖపట్నంలో ఐటీ సంస్థ కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేశ్ కాగ్నిజెంట్, సత్వా సహా మొత్తం తొమ్మిది ఐటీ సంస్థలకు శంకుస్థాపన చేశారు. తరువాత మంత్రి లోకేశ్ రుషికొండ ఐటీ పార్క్ హిల్–2లో మహతి ఫిన్‌టెక్ భవనంలో ఏర్పాటు చేసిన కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించారు.
వెయ్యి సీట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో 21.31 ఎకరాలను కాగ్నిజెంట్‌కు కేటాయించిన ప్రభుత్వం, మూడు దశల్లో రూ.1,583 కోట్లతో ప్రపంచస్థాయి క్యాంపస్ నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించింది. మొత్తం 8,000 మందికి ఉపాధి కలిగించే ఈ ప్రాజెక్టులో, 2029 నాటికి తొలి దశ పూర్తవడంతో 3,000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశముందని ప్రభుత్వం తెలిపింది.



