ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ

Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. నిన్న కేంద్రమంత్రి అమిత్‌షాతో సమావేశమైన చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అదేవిధంగా ఇవాళ ఆర్థికశాఖ మంత్రులతో పాటు ఆరుగురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. అదేవిధంగా ఇవాళ్టి నేర చట్టాల అమలుపై హోంశాఖ సమీక్షకు హాజరుకానున్నారు.
సీఎం చంద్రబాబుతో నేడు యాపిల్ ఎండీ భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడుల కోసం పలువురు పారిశ్రామిక వేత్తలతోనూ చంద్రబాబు సమావేశం అవుతారు. నీతి అయోగ్ పాలక మండలి భేటీలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు.