ఆంధ్ర ప్రదేశ్
నేడు చంద్రబాబు అధ్యక్షతన CRDA, SIPB సమావేశం

నేడు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB, CRDA సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్రానికి కొత్త పెట్టుబడుల ఆకర్షణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. వివిధ రంగాల్లో పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చించనున్నారు. పరిశ్రమల స్థాపనకు అనుమతులపై సమీక్ష జరపనున్నారు. పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. మెగా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. పెట్టుబడిదారులకు వేగవంతమైన అనుమతులపై ఆదేశాలు జారీ చేయనున్నారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి SIPB కీలక నిర్ణయాలు తీసుకోనుంది.



