ఉత్తరఖండ్‌లో క్లౌడ్ బరస్ట్.. 60 మంది గల్లంతు

ఉత్తరకాశీ జిల్లాలో వరదలు బీభత్సం సృష్టించాయి. ఖీర్ గంగా నది ఒక్కసారిగా విరుచుకుపడింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో క్లౌడ్ బరస్ట్ జరిగింది. గంగోత్రీలోని ధరావలి గ్రామంపై కొండచరియలు విరిగిపడ్డాయి. గ్రామం మొత్తాన్ని తుడిచిపెట్టాయి. అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. అయితే క్లౌడ్ బరస్ట్ కారణంగా పలువురు గ్రామస్థులు కొండచరియల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
వారిని రక్షించేందుకు సహాయ బృందాలు రంగంలోకి దిగాయి. క్లౌడ్ బరస్ట్‌లపై ఉత్తరకాశీ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ ఆర్య అధికారికంగా ప్రకటించారు. ఉత్తరాఖండ్‌లోని హర్సిల్ ప్రాంతానికి సమీపంలోని ధరావలిలో భారీ ఎత్తున క్లౌబ్ బరస్ట్ జరిగిందని తెలిపారు. క్లౌడ్ బరస్ట్‌తో భారీగా నష్టపోయిన ధరాలీకి పోలీసులు,ఎస్‌డీఆర్‌ఎఫ్,విపత్తు బృందాలు మొహరించాయి. నివాస ప్రాంతాల్లో సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.



