తెలంగాణ
Medak: మెదక్ జిల్లాలో కాంగ్రెస్ , బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ

Medak: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కోనాయిపల్లె గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలింగ్ కేంద్రం సమీపంలో ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్, బీజేపీ వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ వాగ్వాదం క్రమంగా ఘర్షణకు దారి తీసి, ఇరువర్గాల కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్తత సద్దుమణిగిందని పోలీసులు తెలిపారు.



