ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో తెల్లవారుజామున చిరుత సంచారం

Tirumala: తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరి వద్ద తెల్లవారుజామున చిరుత సంచరించింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈస్ట్ బాలాజీ నగర్ బాల గంగమ్మ ఆలయం వద్ద చిరుత సంచరించింది.దీనిపై టీటీడీ భక్తుల భద్రత కోసం చర్యలు తీసుకుంటోంది. అడవి జంతువుల సంచారం పెరగడంతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.



