Man Mums: హగ్ కి రూ. 600.. చైనాలో ట్రేండ్ అవుతున్న మ్యాన్ మమ్స్

Man Mums: అవతలి వాళ్లు బాధలో ఆందోళనలో ఉన్నపుడు ఆప్యాయంగా కౌగిలించుకుంటే వారి మనసు తేలికవుతుందనే కాన్సెప్ట్ ఉంటుంది. శంకర్ దాదా ఎంబీబీఎస్ అనే సినిమాలో వచ్చిన ఈ కాన్సెప్ట్ అప్పట్లో ఎంతో పాపులర్ అయ్యింది. ఆలోచింపజేసింది. ప్రపంచం ఎవరి పనిలో వారు పడిపోవటం వలన ఎదుటి వ్యక్తి పరిస్థితి ఏంటి ఏ సిచువేషన్ లో ఉన్నాడు. అని ఆలోచించేవారు లేక వాళ్లు పడే వేదనను ఒక్క ఆలింగనంతో ఎలా తీర్చవచ్చో ఆ కాన్సెప్ట్ ఉద్దేశం. ఇప్పుడు అదే కాన్సెప్ట్ చైనాలో ట్రేండ్ అవుతుంది.
మారుతున్న జీవనశైలి కారణంగా ఉరుకులు పరుగుల జీవితం నడుస్తోంది. ప్రేమ, ఆప్యాయతలకు, కుటుంబాలకు కొందరు దూరం అవుతున్నారు. డబ్బు సంపాదించే క్రమంలో ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
ఇందులో భాగంగానే ఒత్తిడికి గురవుతున్న యువతులు అబ్బాయిలను హగ్ చేసుకుంటున్నారు. ఈ హగ్ ఊరికే కాదు. ఒక్కసారి హగ్ చేసుకుంటే సదరు యువతి 50 యువాన్లు అంటే భారత కరెన్సీలో దాదాపు 600 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో చైనా అబ్బాయిలకు ఫుల్ గిరాకీ పెరిగింది.
ఒత్తిడి అధిగమించేందుకు చైనాలోని యువతులు ఓ వినూత్న పద్ధతిని అనుసరిస్తున్నారు. మానసిక సాంత్వన కోసం డబ్బులు చెల్లించి మ్యాన్ మమ్స్ అని పిలవబడే వ్యక్తుల నుంచి కొద్దిసేపు హగ్ పొందుతున్నారు. గతంలో మ్యాన్ మమ్స్ అనే పదాన్ని కండలు తిరిగిన శరీరంతో జిమ్‌లో కసరత్తులు చేసే పురుషులను ఉద్దేశించి వాడేవారు. అయితే ఇప్పుడు ఈ పదం అర్థం మారింది.
శారీరకంగా ధృడంగా ఉంటూనే, సున్నితత్వం, ఓర్పు, ఆప్యాయత వంటి లక్షణాలున్న పురుషులను మ్యాన్ మమ్స్గా పరిగణిస్తున్నారు. వీరు అందించే కౌగిలింతలు ఒత్తిడిని తగ్గించి ఓదార్పునిస్తాయని యువతులు భావిస్తున్నారు. చైనా ప్రస్తుతం మ్యాన్ మమ్స్ ట్రెండ్‌లోకి వచ్చింది.
ఇక ఈ ట్రెండ్ ప్రకారం అమ్మాయికి ఎవరైనా అబ్బాయి ఐదు నిమిషాల పాటు హగ్ ఇస్తే 600 చెల్లిస్తారు. అమ్మాయిలు. ఆన్ లైన్లో ముందుగానే ఈ హగ్స్ కోసం అమ్మాయిలు నచ్చిన కుర్రాడిని బుక్ చేసుకుంటారు. ఆ తర్వాత మాల్స్, పార్కులు, అండర్ గ్రౌండ్ రోడ్లు ఇలా పబ్లిక్ ప్లేసుల్లో ఇలా చేస్తున్నారు. ఇలా నచ్చినవారిని హగ్ చేసుకోవడం వల్ల తమ ఒత్తిడి తగ్గిపోతుందని అమ్మాయిలు భావిస్తున్నారు.