ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: ఆ ఎన్నికల్లో ఓటమికి నేనే కారణం

Chandrababu: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2004, 2019 ఎన్నికల్లో నన్నెవరూ ఓడించలేదని ఆ ఎన్నికల్లో ఓటమికి నేనే కారణం అని సీఎం చంద్రబాబు తెలిపారు. కొన్ని పనులు చేయలేకపోవడం వల్లే ఓడిపోయామని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో పనిలో పడి పార్టీ, ఎమ్మెల్యేలను సమన్వయం చేయలేకపోయానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ క్రమంలో ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపితే ఓటమి ఉండదని అసెంబ్లీ వేదికగా సీఎం తేల్చి చెప్పారు. ఉగాది నుంచి రాష్ట్రంలో పీ4 విధానం అమలు చేస్తామని తెలిపారు. నియోజకవర్గాల వారీగా పీ4 అమలుకావాలని సీఎం చంద్రబాబు తెలిపారు. 2029 లో ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఎన్నికలకు వెళదాం అన్నారు.