ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

Chandrababu: సీఎం చంద్రబాబు రేపు విశాఖ పర్యటనకు రానున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. మధురవాడ ఐటీ హిల్స్‌లో కాగ్నిజెంట్ క్యాంపస్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే హెలిప్యాడ్, సభాప్రాంగణ పరిసరాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు పరిశీలించారు. భద్రతా పరంగా ఎక్కడా లోపం లేకుండా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.



