ఆంధ్ర ప్రదేశ్
నేడు హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన

Chandrababu: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ మండలంలో ఉన్న కన్హా శాంతి వనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సందర్శించనున్నారు. ఉదయం జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి బయల్దేరి 11 గంటలకు కన్హా శాంతివనానికి చేరుకుంటారు.
అక్కడ ఆశ్రమ అధ్యక్షులు కమలేష్ డి. పటేల్ (దాజీ)తో సీఎం సమావేశమవుతారు. అనంతరం రెండు గంటల పాటు శాంతివనంలోని వెల్నెస్, మెడిటేషన్ సెంటర్లు, యోగా కేంద్రాలను సందర్శించి పరిశీలించనున్నారు.



