నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు

Chandrababu: ఏపీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు మరింత ఫోకస్ పెట్టారు. అలాగే రైతు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. రాత్రి ఢిల్లీకి బయల్దేరనున్న చంద్రబాబు.. మిర్చి ధరలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మిర్చి రైతుల ఇబ్బందులను మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు రేపటి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని కలిసి చర్చించే అవకాశం కన్పిస్తోంది. మిర్చి రైతుల సమస్యలను వివరించనున్నారు.
అయితే ఇప్పటికే మిర్చి సమస్యలపై కేంద్రానికి లేఖలు రాశామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇవాళ ఢిల్లీకి బయల్దేరనున్న చంద్రబాబు రాష్ట్ర బడ్జెట్‌పై కూడా సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ఆర్థికశాఖ ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. ఇక రేపు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి ఎన్డీయే నేతలకు ఆహ్వానం అందింది.